TG PGECET 2026 : టీజీ పీజీఈసెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-24 14:38:09  IST  )

TG PGECET 2026 : టీజీ పీజీఈసెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ఈ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ నేడు విడుదల కానున్నట్లు టీజీ సెట్స్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://pgecetadm.tgche.ac.in ను సందర్శించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సీసీ, క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు స్లాట్ బుకింగ్ ద్వారా ఓయూలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కేంద్రంలో విద్యార్థులు హాజరై తమ సర్టిఫికేట్లను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు:

కౌన్సిలింగ్ ప్రక్రియ తేదీ

ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ ఎంఫార్మసీ, ఫార్మ్ డి(పీబీ)

1.ఆన్ లెన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల జులై 2 నుండి 9 వరకు జులై 26 నుండి 31 వరకు

అప్ లోడింగ్

2.ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జులై 7 నుండి 9 వరకు జులై 29 నుండి 31 వరకు

3.అర్హులైన అభ్యర్థులజాబితాప్రదర్శన జులై 12 న ఆగస్టు 3న

4.వెబ్ ఆప్షన్ల నమోదు(ఫేజ్1) జులై 13నుండి 15 వరకు ఆగస్టు 4 నుండి 6 వరకు

5.వెబ్ ఆప్షన్ల సవరణ జులై 16 ఆగస్టు7

6.మొదటివిడత సీట్ల కేటాయింపు జులై 19 ఆగస్టు10

7.కాలేజీల్లో రిపోర్టింగ్, ఒరిజినల్సర్టిఫికెట్లపరిశీలన జులై 20 నుండి 24 వరకు ఆగస్టు 11 నుండి 14 వరకు

Next Story