మేయర్ చూస్తుండగానే డ్రైనేజ్‌లో పడిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

సాధార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఏవైనా స‌మ‌స్య‌లు వ‌స్తే వెంట‌నే ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ద్ద‌కు వెళ్లి చెప్పుకుంటారు. అది విన్న‌త‌ర‌వాత గుర్తుంటే స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రిస్తారు లేదంటే లేదు.

మేయర్ చూస్తుండగానే డ్రైనేజ్‌లో పడిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: సాధార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఏవైనా స‌మ‌స్య‌లు వ‌స్తే వెంట‌నే ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ద్ద‌కు వెళ్లి చెప్పుకుంటారు. అది విన్న‌త‌ర‌వాత గుర్తుంటే స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రిస్తారు లేదంటే లేదు. ఇక ప్ర‌జాప్ర‌తినిధి ముందే స‌మ‌స్య క‌న‌బ‌డింది అంటే వారి పాల‌న ఎలా ఉందో చూసి వారే షాక్ అవ్వాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. తాజాగా ముంబైలో అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ముంబైలో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో మేయ‌ర్ రోడ్డుపైకి వ‌చ్చి స‌హాయ‌క చ‌ర్య‌లను ప‌ర్య‌వేక్షించ‌డం మొద‌లుపెట్టింది.

అయితే ఆమె అధికారులతో మాట్లాడుతున్న స‌మ‌యంలోనే క‌ళ్ల ముందే ఓ వ్య‌క్తి ప‌క్క‌న ఉన్న మ్యాన్ హోల్ లో ప‌డిపోయాడు. దీంతో మేయ‌ర్ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గురైంది. వెంట‌నే అక్క‌డ ఉన్న వ్య‌క్తులు మ్యాన్ హోల్ లో ప‌డిపోయిన వ్య‌క్తిని ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న‌లో అధికారులపై మేయ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ్యాన్ హోల్స్ మూసివేయాల‌ని ఆదేశించింది. ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు మేయ‌ర్ ప‌నితీరుపై, అధికారుల ప‌నితీరుపై మండిప‌డుతున్నారు.

Next Story