- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమర్ధవంతమైన సేవలు అందించాలి : డీఎస్పీ
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, సమర్ధవంతమైన సేవలు అందించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు.

దిశ, పాపన్నపేట : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, సమర్ధవంతమైన సేవలు అందించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. బుధవారం పాపన్నపేట మండల పోలీస్ స్టేషన్ ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, కేసుల నమోదు పుస్తకాలు, సీసీ కెమెరాల పనితీరు, మాల్ ఖానా నిర్వహణ, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ తీరు, స్టేషన్‌లో అమలు చేస్తున్న విధానాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ తీరును పరిశీలించిన డీఎస్పీ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీస్ సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండటంతో సిబ్బందిని అభినందించారు. ఈ తనిఖీలో సీఐకృష్ణమూర్తి , ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్, ఎ ఎస్ ఐ తుక్కయ్య , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






