ప్రతిరోజూ భయంతో గడపాల్సిన పరిస్థితి వచ్చింది.. రష్మిక షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఏ విషయం మాట్లాడాలన్నా తనకు చాలా భయమేస్తోందని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రతిరోజూ భయంతో గడపాల్సిన పరిస్థితి వచ్చింది.. రష్మిక షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియా హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది. అయితే ఈ సోషల్ మీడియాను చాలామంది తమ కెరీర్ ఎదుగుదలకు వాడుకుంటున్నారు. కానీ, ఇదే సోషల్ మీడియా కొందరికి పెద్ద శాపంగా మారుతోంది. సెలబ్రిటీలు ఎప్పుడు ఏ చిన్న మాట మాట్లాడినా.. దాని వల్ల ఎలాంటి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందోనని షాక్ తగిలినట్లు భయపడిపోతున్నారు. ఒక్కోసారి వారు సాధారణంగా చేసిన వ్యాఖ్యలను కూడా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ భయం వల్ల కొందరు సెలబ్రిటీలు తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్తుంటే.. మరికొందరు విమర్శలు తట్టుకోలేక సోషల్ మీడియాకే దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఏ విషయం మాట్లాడాలన్నా తనకు చాలా భయమేస్తోందని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఏదైనా మాట్లాడితే.. దాన్ని పూర్తిగా మార్చేసి, వేరే విధంగా బయటకు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అసలు తాను అనని విషయాలను కూడా అన్నట్లుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రష్మిక చెప్పుకొచ్చింది. దీనివల్ల రోజూ ఉదయం లేవగానే.. తన గురించి నెట్‌లో ఎలాంటి తప్పుడు ప్రచారం జరుగుతుందో, ఎలాంటి రూమర్ వస్తుందోనని నిత్యం భయంతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా మనుషులు ఎదగడం చాలా మంచి విషయమే కానీ.. కొందరు మాత్రం దాన్ని ఇతరులను తక్కువ చేయడానికి, తప్పుగా వాడుకోవడానికి ఉపయోగించడం అస్సలు బాగోలేదని రష్మిక స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

Next Story