నా బాడీ నా హక్కు అంటే వాడి కళ్లు వాడి ఇష్టం.. సింగర్ సునిత సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ సింగర్ సునిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా బాడీ నా హక్కు అనుకుంటే చూసేవాడు నా కళ్లు నా ఇష్టం అని అంటాడని అన్నారు. శరీరాన్ని చూపించడం అసలు ఫ్రీడమ్ కిందకు రాదని అన్నారు.

నా బాడీ నా హక్కు అంటే వాడి కళ్లు వాడి ఇష్టం.. సింగర్ సునిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ సింగర్ సునిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా బాడీ నా హక్కు అనుకుంటే చూసేవాడు నా కళ్లు నా ఇష్టం అని అంటాడని అన్నారు. శరీరాన్ని చూపించడం అసలు ఫ్రీడమ్ కిందకు రాదని అన్నారు. నీకు నచ్చిన దుస్తులు వేసుకో.. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు కానీ అది కరెక్ట్ అని చెప్పొద్దు అంటూ వ్యాఖ్యానించారు. సేఫ్ గా అనిపించినంతవరకు నీకు నచ్చిన దుస్తులు నువ్వు వేసుకోవచ్చని, ఎవరూ వ్యతిరేకించరని అన్నారు. ఎవరి చూపులు నిన్ను తాకనప్పుడు, ఎవరూ నిన్ను చూడటంలేదని అనిపించినప్పుడు నీకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని చెప్పారు.

సినిమా ఇండస్ట్రీలో నటీమణులు డ్రెస్సింగ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో సింగర్ సునిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సునిత మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో కొందరు సమర్దిస్తుంటే మరికొందరు ఆమె కామెంట్లను వ్యతిరేఖిస్తున్నారు. సునిత చేసిన కామెంట్లు అనసూయ, చిన్మయి లాంటి వాళ్లకు గట్టి సమాధానం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సునిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Next Story