- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో రైల్ ఆస్తులు రేవంత్ తాత జాగీరు కాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
మెట్రో రైల్ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మెట్రో రైల్ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మెట్రో రైల్ కట్టినోడు కాదు.. రూపాయి పెట్టినోడు కాదని.. ఐఆర్ఎఫ్‌సీకి ఎలా సంతకం పెట్టారని ప్రశ్నించారు. మెట్రో రైల్ విషయంలో మూర్ఖత్వంగా వ్యవహరించారని.. పబ్లిక్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐఆర్ఎఫ్‌సీ ఒప్పందం రద్దయిందా లేదా స్పష్టం చేయాలన్నారు. రూ.84 కోట్లు ఐఆర్ఎఫ్‌సీకి రేవంత్ చెల్లించారని ఆరోపించారు. మెట్రో విషయంలో తలా తోక లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని.. కిషన్‌రెడ్డి కాళ్లు పట్టుకొని కేంద్ర మంత్రిని కలిశారని అన్నారు. ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కేటీఆర్, హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాహుల్‌గాంధీ సీటుకు రేవంత్ ఎసరు పెట్టకుండా యెన్నం చూసుకోవాలని సూచించారు. ఏఐసీసీ లైన్‌కు వ్యతిరేకంగా రేవంత్ వెళ్తున్నారని.. ఎప్పటికైనా ఆయన బీజేపీలో చేరతారని అన్నారు. అలాగే.. మెట్రో రైల్‌పై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.






