టీచర్ల నియామకం కుంభకోణం.. రాష్ట్రవ్యాప్తంగా ఈడీ దాడులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-23 06:33:27  IST  )

దేశంలో అక్రమ నగదు చలామణి కేసులపై ఈడీ నిఘా పెంచింది. ఇందులో భాగంగా తమిళనాడులోని పలుచోట్ల ఈడీ అధికారులు విస్తృతసోదాలు నిర్వహించారు.

టీచర్ల నియామకం కుంభకోణం.. రాష్ట్రవ్యాప్తంగా ఈడీ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అక్రమ నగదు చలామణి కేసులపై ఈడీ నిఘా పెంచింది. ఇందులో భాగంగా తమిళనాడులోని పలుచోట్ల ఈడీ అధికారులు విస్తృతసోదాలు నిర్వహించారు. తమిళనాడులో ఉపాధ్యాయ నియామక పరీక్షల అవకతవకలకు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు ఒకేసారి 18 ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాజధాని ప్రాంతమైన చెన్నై సహా.. తిరుచిరాపల్లి, కోయంబత్తూర్, మదురై వంటి ప్రధాన నగరాల్లో పలు ఈడీ బృందాలు ఉదయం నుంచి ఏకకాలంగా సోదాలు చేస్తున్నాయి. 2017లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఈ దాడులకు ప్రధాన ఆధారమయింది. 2021లోనే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలైంది. ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడి, కొందరు వ్యక్తులు భారీగా అక్రమంగా డబ్బు సంపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి.. అక్రమ డబ్బు ఏం చేశారన్న ఆర్థిక మూలాలను కనిపెట్టేందుకు ఈ దాడులు నిర్వహించింది.

కేరళలోనూ ఈడీ దాడులు

మరోవైపు కేరళలో కలకలం రేపుతున్న మానవ అవయవాల అక్రమ రవాణా నెట్వర్క్ పై కూడా ఈడీ విరుచుకుపడింది. కొచ్చి, దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 ప్రాంతాల్లో ఈడీ జోనల్ కార్యాలయ అధికారులు తెల్లవారుజామునుంచే సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఈ-రాకెట్ తో సంబంధం ఉన్నదన్న అనుమానంతో కొన్ని ప్రముఖ ఆస్పత్రులు, వాటికి అనుబంధంగా ఉన్న సంస్థల కార్యాలయాలను అధికారులు జల్లెడపట్టారు. అక్రమంగా అవయవమార్పిడులు చేయడం ద్వారా కోట్లాది రూపాయల బ్లాక్ మనీ చేతులు మారినట్లు వచ్చిన పక్కా సమాచారంతోనే ఈ దాడులు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం

Next Story