- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొలీజియం ఎంపికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. సీనియరైతే పదవి ఇవ్వాలా?
కొలీజియం ఎంపికపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. జడ్జీల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతంగా ఉంటుందని స్పష్టం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కొలీజియం ఎంపికపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. జడ్జీల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతంగా ఉంటుందని స్పష్టం చేసింది. జడ్జీల నియామక ప్రక్రియ సమాచార హక్కు చట్టం కిందికి రాదని జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జడ్జీల ఎంపిక అనేది పూర్తిగా కొలీజియం అంతర్గత సంతృప్తిపైనే డిపెండ్ అయి ఉంటుందని పేర్కొంది. కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకుని కొత్త సమస్యలను తెచ్చిపెట్టుకోలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీనియారిటీ ఉన్నంత మాత్రాన హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందే హక్కు లభించదని తేల్చిచెప్పింది. అభ్యర్థి యోగ్యతతో పాటు అర్హత కూడా కొలీజియం పరిశీలిస్తుందని, జడ్జి నియామకానికి కొలీజియం ఆమోదం తెలిపిన తర్వాత.. దానిపై మరోసారి చర్చలు, వాదనలు జరిపే అవకాశం లేదని స్పష్టం చేసింది. తనకంటే జూనియర్లకు పదోన్నతి ఇచ్చారంటూ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సీనియర్ జ్యుడీషియల్ అధికారి దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.






