- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అనుభూతి కంటే గొప్పది ఏదీ ఉండదు.. ఎంతో గర్వంగా ఉందంటూ శార్వరి ఎమోషనల్ పోస్ట్
మనం ప్రాణం పెట్టి చేసిన ఒక పని, ఇతరుల హృదయాలను తాకినప్పుడు కలిగే అనుభూతి కంటే గొప్పది ఏదీ ఉండదు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మెయిన్ వాపస్ ఆవుంగా’. ఈ పీరియాడిక్ రోమాంటిక్ డ్రామాలో దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమాను దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించారు. దేశ విభజన నాటి నేపథ్యంలో సాగే ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొదటి రోజు యావరేజ్ టాక్ సాధించినప్పటికీ.. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా సెకండ్ వీకెండ్‌లో వసూళ్లు భారీగా పెరగడంతో, దేశవ్యాప్తంగా థియేటర్ల యజమానులు ఈ సినిమా స్క్రీన్లను, షోలను భారీగా పెంచేశారు.
ఈ ఏడాదిలోనే కేవలం మౌత్ టాక్‌తో ఇంత పెద్ద సక్సెస్ సాధించిన చిత్రంగా ‘మేన్ వాపస్ ఆవుంగా’ రికార్డు సృష్టించిందని టాక్. తాజాగా, ఈ సూపర్ సక్సెస్‌పై శార్వరీ ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. "మనం ప్రాణం పెట్టి చేసిన ఒక పని, ఇతరుల హృదయాలను తాకినప్పుడు కలిగే అనుభూతి కంటే గొప్పది ఏదీ ఉండదు. ప్రేక్షకుల నుంచి వస్తున్న మెసేజ్‌లు, వీడియోలు, వారి కళ్లలో నీళ్లు.. ఇవన్నీ చూస్తుంటే నా కళ్లల్లో కూడా నీళ్లు వస్తున్నాయి. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే కథలో భాగం కావాలని ప్రతి నటుడు కలలుకంటారు. ఈ సినిమాను మీరంతా ఇంతలా ఓన్ చేసుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. థియేటర్లకు వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు, మాతో పాటు ప్రతి ఎమోషన్‌ను ఫీల్ అయినందుకు థ్యాంక్స్. మీ ప్రేమతోనే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది" అని రాసుకొచ్చారు.






