- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు సాగుకు మేలైన రకాలే పండించాలి: వ్యవసాయ అధికారి
ప్రభుత్వాలు సూచిస్తున్న సాగుకు సానుకూలమైన మేలైన విత్తనాలను రైతులు సాగు చేయాలని ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి కోర్ర రమేష్ సూచించారు.

దిశ, ఉప్పునుంతల: ప్రభుత్వాలు సూచిస్తున్న సాగుకు సానుకూలమైన మేలైన విత్తనాలను రైతులు సాగు చేయాలని ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి కోర్ర రమేష్ సూచించారు. మండలంలోని ఉప్పునుంతల, మర్రిపల్లి, పిరత్వానిపల్లి, గ్రామాలలోని రైతు వేదికల్లో విత్తన మేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు సన్న వడ్లకు ప్రభుత్వ బోనస్ అందాలంటే ఏడు రకాలైన విత్తనాలు బిపిటి 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి సోనా, కేఎన్ఎం 1638, 7715V, జైశ్రీరామ్ విత్తనాలు సాగు చేయాలని సూచించారు. ప్రస్తుత ఉన్నటువంటి వాతావరణం పరిస్థితుల్లో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండి) సమాచారం మేరకు వర్షభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రైతులు గమనించి ప్రత్యామ్నాయ పంటలను (కందులు, మినుములు)ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు. అదేవిధంగా నానో యూరియా, నానో డిఏపీ వాడకం గురించి రైతులకు వివరించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఆయా క్లాస్టర్ల ఏఈఓలు,రైతులు పాల్గొన్నారు.






