భవిష్యత్తు లేని పార్టీ బిఆర్ఎస్

by Ratna Kumari |

అబ్దుల్లాపూర్ మెట్ మండలం పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..

భవిష్యత్తు లేని పార్టీ బిఆర్ఎస్
X

దిశ‌, అబ్దుల్లాపూర్ మెట్ : అబ్దుల్లాపూర్ మెట్ మండలం పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. లస్కర్ గూడ గ్రామ బ్రిడ్జి నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో చేపడుతున్న తరుణంలో బిఆర్ఎస్ నిరసన డ్రామా చేపట్టిందని రాబోవు కాలంలో బిఆర్ఎస్ నాయకులకు ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారని, భవిష్యత్తు లేని బిఆర్ఎస్ ప్రజలను గత ప్రభుత్వంలో నయవంచన చేసి అడ్డదారిన సొమ్ము చేసుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, లస్కర్ గూడ బ్రిడ్జిపై వరద ఉధృతికి ఇరువురి ప్రాణాలు బలైన చెలించని మాజీ ఎమ్మెల్యే ప్రమాదం జరిగిన మూడు సంవత్సరాలకు ఎన్నికల ముందు బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్టు డ్రామా చేసి వదిలేసాడని ఈరోజు మళ్లీ రాబోయే ఎన్నికల్లో తన మనుగడ ప్రజలలో ఎక్కడ కోల్పోతానోనని నిరసన గ్రామాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక దుష్ప్రచారానికి ఒడిగట్టాడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మాల్ రెడ్డి రంగారెడ్డి ఈ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని సుమారుగా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో చేస్తున్నాడని నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సాధక బాధకాలను పంచుకుంటున్నటువంటి ఎమ్మెల్యే రంగారెడ్డిని దుష్ప్రచారం చేయడం మానుకో మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఏకైక లక్ష్యంతో ఇప్పటికీ నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని నియోజకవర్గం ఘనత ఎమ్మెల్యే ది, గత ప్రభుత్వంలో నీవు ఏమి అభివృద్ధి పనులు చేశావో ఆత్మ పరిశీలన చేసుకో, ఎమ్మెల్యే రంగారెడ్డిని విమర్శించే నైతిక హక్కు మంచి రెడ్డి కిషన్ రెడ్డికి లేదు, ఈ ప్రాంతంలో 179 ఎకరాలలో జాతీయస్థాయిలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేస్తుంటే కళ్ల మంటతో రగిలిపోతున్న మంచిరెడ్డి శాతనైతే అభివృద్ధికి సహకరించు లేకుంటే నీ కల్లబొల్లి మాటలు ఆపుకో అని ఈ సందర్భంగా అన్నారు, ఈ ప్రాంత అభివృద్ధికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్యమంత్రి సహకారంతో ముందుండి పనిచేస్తున్నారని అది ప్రజలందరూ గమనిస్తున్నారని, మీ అబద్ధాలు ప్రజలు ఇదే పరిస్థితిలో లేరని ఈ సందర్భంగా అన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, ఫుడ్ మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, జెక్కిడి రవీందర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ గౌడ్, అల్లే ఐలయ్య, శ్రీశైలం గౌడ్, భాస్కర్ గౌడ్ అశోక్ మహేందర్ శ్రీధర్ ప్రణీత్ యాదవ్ వందలాది మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story