వలలో చిక్కి హోటల్ వ్యాపారి మృతి

by velandi.Saikiran |

బసవన్న చెరువు వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన కత్తి భిక్ష‌ప‌తి, వలలో చిక్కి అక్కడికక్కడే మృతి చెందాడు.

వలలో చిక్కి హోటల్ వ్యాపారి మృతి
X

దిశ, గీసుకొండ: బసవన్న చెరువు వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన కత్తి భిక్ష‌ప‌తి, వలలో చిక్కి అక్కడికక్కడే మృతి చెందాడు. మత్స్యకారులు వేసిన వలలో అనుకోకుండా చిక్కుకున్న బిక్షపతి, దాన్ని నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి అతడిని వల నుంచి బయటకు తీసినా ఫ‌లితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న గీసుకొండ పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Next Story