అసెంబ్లీలో ‘దళపతి’ మార్క్.. సినీ స్టైల్‌లో స్పీచ్ ముగించిన సీఎం విజయ్!

by Ramesh Naini |

తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తనదైన సినీ స్టైల్‌ హావభావాలతో ప్రసంగాన్ని ముగించి అందరి దృష్టిని ఆకర్షించారు.

అసెంబ్లీలో ‘దళపతి’ మార్క్.. సినీ స్టైల్‌లో స్పీచ్ ముగించిన సీఎం విజయ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తనదైన సినీ స్టైల్‌ హావభావాలతో ప్రసంగాన్ని ముగించి అందరి దృష్టిని ఆకర్షించారు. మంగళవారం అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతుండగా, ప్రతిపక్ష డీఎంకే (DMK) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని విజయ్.. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అనుమతితో ఒక నాటకీయ సైగతో (డ్రామాటిక్ జెస్టర్) తన ప్రసంగానికి ముగింపు పలికారు. గతంలో మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ విలేకరుల సమావేశంలో చేత్తో ‘ఇక అంతా అయిపోయింది’ (ఇట్స్ ఓవర్) అనేలా చేతితో చేసిన ఒక సైగ తీవ్ర సంచలనమై, పొలిటికల్ మీమ్‌గా మారింది. ఇప్పుడు సీఎం విజయ్ అదే సైగను అసెంబ్లీలో రీ-క్రియేట్ చేస్తూ డీఎంకేకు కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరిని ఉద్దేశించి ఈ సైగ చేయాలనుకున్నానో వారు సభలో లేరంటూనే, విజయ్ నవ్వుతూ చేసిన ఈ యాక్షన్‌కు తమిళగ వెట్రి కళగం (TVK) సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బర్త్‌డే ట్రీట్.. అభిమానులు హంగామా

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఇది ఒక పెద్ద ‘బర్త్‌డే ట్రీట్’ అంటూ నెటిజన్లు, అభిమానులు హంగామా చేస్తున్నారు. సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా రాణించిన విజయ్, 2024లో ‘టీవీకే’ పార్టీని స్థాపించి, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Next Story