కొత్తగూడెంలో ఉద్రిక్తత.. నాగరాజు కేసుపై పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

by Batti.Sumithra |   (  Updated:2026-06-23 14:43:36  IST  )

మృతుడు నాగరాజు కేసులో పోలీసులు ఏకపక్షంగా విచారణ చేపడుతూ ముందుగానే ఒక కోణంలో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఆరోపిస్తూ నాగరాజు బంధువులు, కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం నిరసన చేపట్టారు.

కొత్తగూడెంలో ఉద్రిక్తత.. నాగరాజు కేసుపై పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
X

దిశ, కొత్తగూడెం : మృతుడు నాగరాజు కేసులో పోలీసులు ఏకపక్షంగా విచారణ చేపడుతూ ముందుగానే ఒక కోణంలో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఆరోపిస్తూ నాగరాజు బంధువులు, కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. మృతుడి చెల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. కేసులో అన్ని కోణాల్లో విచారణ జరపకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని, అసలు నిజాలు బయటకు రాకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు.

నాగరాజు పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించారని గ్రామస్తులు నిరసన చేపట్టారు. నాగరాజుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొంతసేపు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా జరుగుతున్న సమయంలో ఒక యువకుడు తన పై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్లి డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు గ్రామస్తులు, మహిళలు యత్నించారు. పోలీసులు నిరసన చేస్తున్న వారిని నిలువరించి మాట్లాడి పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Next Story