ల్యాదల్ల రాజుది సహజ మరణమే

by velandi.Saikiran |

ల్యాదల్ల రాజు అనుమానాస్పద మరణం కేసుపై పోలీసులు సమగ్ర విచారణ పూర్తి చేశారు.

ల్యాదల్ల రాజుది సహజ మరణమే
X

దిశ , గీసుకొండ: ల్యాదల్ల రాజు అనుమానాస్పద మరణం కేసుపై పోలీసులు సమగ్ర విచారణ పూర్తి చేశారు. రాజు మరణం కార్డియాక్ అరెస్ట్‌తో కూడిన సహజ మరణమని పరకాల ఏసీపీ సతీష్ స్పష్టం చేశారు. గొర్రెకుంట గ్రామంలో గత సంవత్సరం ల్యాదల్ల రాజు మృతికి సంబంధించిన కేసుపై గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పరకాల ఏసీపీ సతీష్ పాల్గొని కీలక వివరాలు వెల్లడించారు.

ల్యాదల్ల రాజు మరణంపై పోలీసులు అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా విచారణ చేపట్టి పూర్తి చేశారని తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్‌లో కార్డియాక్ అరెస్ట్ వల్లనే మరణం సంభవించిందని తేలిందన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో పోలీసు శాఖ అన్ని విధాలుగా బాధ్యతాయుతంగా, నిబద్ధతతో వ్యవహరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసిపి వెంకటేష్ ,తహసిల్దార్ రైయజోద్దీన్, ఎస్సై కుమార్ , అనిల్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story