ఇరాన్ యూఎస్ నుండే ఆహారం కొనాలి.. శాంతి చర్చల వేళ ట్రంప్ వార్నింగ్

by Ajay Maddhiboyina |

ఓవైపు స్విట్జర్లాండ్‌లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ట్రంప్ శత్రుదేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేసిన తరవాత ఆ డబ్బుతో ఇరాన్ కేవలం అమెరికా నుండే ఆహారం కొనుగోలు చేయాలని అన్నారు.

ఇరాన్ యూఎస్ నుండే ఆహారం కొనాలి.. శాంతి చర్చల వేళ ట్రంప్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఓవైపు స్విట్జర్లాండ్‌లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ట్రంప్ శత్రుదేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేసిన తరవాత ఆ డబ్బుతో ఇరాన్ కేవలం అమెరికా నుండే ఆహారం కొనుగోలు చేయాలని అన్నారు. ఆ ఫండ్స్ తిరిగి అమెరికా రైతులకే అందుతాయని చెప్పారు. ఇరాన్ ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్ తో కుదిరిన ఏ ఒప్పందానికి క‌ట్టుబ‌డి ఉండ‌క‌పోయినా తాను అన్ని చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పారు. వాళ్లు త‌మ‌ను గౌర‌వించినంత‌కాలం ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని అన్నారు.

ఇరాన్ పై సైనికచ‌ర్య‌కు పాల్ప‌డితే ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై దాని ప్ర‌భావం ఉండ‌వ‌చ్చ‌నే అనుమానాల‌ను ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్ అణ్వాయుధాల‌ను త‌యారు చేయ‌కుండా నిరోధించ‌డం ఆర్థిక‌మాంద్యం కంటే ముఖ్యం అని చెప్పారు. మ‌రోవైపు వైట్ హౌస్ ఈస్ట‌ర్ ఎగ్ రోల్ కార్య‌క్ర‌మంలో ట్రంప్ మాట్లాడుతూ.. త‌న‌కు అవ‌కాశం ఉంటే ఇరాన్ లోకి ప్ర‌వేశించి చ‌మురు వ‌న‌రుల‌ను స్వాధీనం చేసుకుంటాన‌ని అన్నారు. రిప‌బ్లిక‌న్లు త‌న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని, అదే స‌మ‌యంలో అమెరికా బ‌ల‌గాలు తిరిగి స్వేదేశానికి తిరిగి రావాల‌ని కూడా వాళ్లు కోరుకుంటున్నార‌ని చెప్పారు.

Next Story