సంచలనం సృష్టించిన హత్య కేసు చేధించిన మెట్ పల్లి పోలీసులు

by velandi.Saikiran |

సంచలనం సృష్టించిన హత్య కేసును మెట్ పల్లి పోలీసులు చేధించారు.

సంచలనం సృష్టించిన హత్య కేసు చేధించిన మెట్ పల్లి పోలీసులు
X

దిశ, మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలో ఈ నెల 20వ‌ శనివారం దాసరి రాజేంద్రప్రసాద్ అనుమానాస్పద మృతి కేసును హత్యగా తేల్చారు. పట్టణంలోని ఆదర్శనగర్ కు చెందిన దాసరి రాజేంద్రప్రసాద్ (55)అనే బిల్డర్ నూతన నిర్మాణ పనుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతం కుమార్ అనే కార్మికుడిని పనిలో పెట్టుకున్నట్లు మెట్ పల్లి డి.ఎస్.పి ఏ రాములు తెలిపారు. అత‌డే ఈ కుట్ర‌కు తెర‌లేపిన‌ట్లు చెప్పారు. నిందితుడు గౌతమ్ కుమార్ (23) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బర్దిహ్ గ్రామానికి చెందిన వాడ‌న్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా మెట్ పల్లి పట్టణానికి వలస వచ్చి, ఆదర్శనగర్ లో అద్దెకు ఉంటున్నాడ‌ని తెలిపారు. ఇక్క‌డే టైల్స్, పెయింటింగ్ పనులు చేస్తున్న‌ట్లు గుర్తించారు. ఈ నెల 20న మృతునితో వాగ్వాదానికి దిగి గొడ్డలితో తలపై బలంగా కొట్టి, మెడలో బంగారు ఎత్తుకెళ్లాడ‌ని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఏడు గ్రాముల గోల్డ్ చైన్, ఒక మొబైల్ ఫోన్, ఒక ద్విచక్ర వాహనం, హత్యకు ఉపయోగించిన గొడ్డలి స్వాదీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన సీఐ సురేష్ బాబు, మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్,ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మండల ఎస్ఐలు, నవీన్, అనిల్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినంధించినట్లు తెలిపారు.

Next Story