- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్‌ను అంటే ఊరుకోవద్దు.. మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు
కేబినెట్ భేటీ తరవాత సీఎం చంద్రబాబు మంత్రులకు పలు సూచనలు చేశారు. వైసీపీ క్రిమినల్స్ ను వెనకేసుకుని వస్తోందని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: కేబినెట్ భేటీ తరవాత సీఎం చంద్రబాబు మంత్రులకు పలు సూచనలు చేశారు. వైసీపీ క్రిమినల్స్ ను వెనకేసుకుని వస్తోందని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ ను అనవసరమైన విషయాల్లోకి లాగితే కూటమి ఐక్యత చాటేలా మంత్రులంతా స్పందించాలని అన్నారు. ప్రతి మంత్రి అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. డీఎస్సీ పరీక్షపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరిగా నామకరణం చేద్దామని అన్నారు. అంతే కాకుండా జూలై 3న కడక స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేద్దామని అన్నారు.
విజయవాడ సాయికృష్ణ ఘటనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. బాధిత తల్లిదండ్రులకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సాయికృష్ణ ఘటనను వైసీపీ రాజకీయం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కల్యాణ్ సైతం తనపై వస్తున్న విమర్శలపై జనసేన మంత్రులు స్పందించాలని ఆదేశించారు. ప్రతిసారి తానే మాట్లాడటం కుదరని మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి కౌంటర్లు ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు సైతం తమ పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ ను విమర్శించినప్పటికీ కౌంటర్లు ఇవ్వాలని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.






