- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. రైతు మృతి
by velandi.Saikiran |
బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగులగా రైతు మృతి చెందిన సంఘటన గంగారం మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, కొత్తగూడ: బట్టలు ఆరేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామంలోని ఈసం సంజీవరావు (38) అనే రైతు తన ఇంటి ఆవరణలో బట్టలు ఆరేయడానికి తీగ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Next Story






