- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికుల హక్కుల పై దాడి చేస్తే గనులు స్తంభిస్తాయి : కొరిమి రాజ్‌కుమార్
సింగరేణి కార్మికుల హక్కుల ఉల్లంఘన, సమస్యలపై ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఏఐటీయూసీ ఖండించింది.

దిశ, కొత్తగూడెం సింగరేణి : సింగరేణి సంస్థలో కార్మికుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నా యాజమాన్యం, ప్రభుత్వాలు వాటి పరిష్కారం పై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, కార్మికుల హక్కులను కాలరాస్తూ సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే విధానాలను ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం సెంట్రల్ వర్క్‌షాప్‌లో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ దేశానికి బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో రాజకీయ జోక్యాలు, కార్మిక వ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘంగా ఉన్నప్పటికీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ఏఐటీయూసీ 31 ప్రధాన డిమాండ్ల పై సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల శ్రమ చట్టాలపై తీవ్రమైన దాడి అని, వాటి అమలు కారణంగానే 12వ వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని విమర్శించారు. వేజ్ రివిజన్‌ను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తూ లక్షలాది మంది బొగ్గు కార్మికులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి.రమణమూర్తి, ఉపాధ్యక్షులు క్రిస్టఫర్, సహాయ కార్యదర్శి రాము,పిట్ కార్యదర్శి నరేష్, నాయకులు నాగయ్య, నరసయ్య, మల్లయ్య, రాజేశ్వరరావు, రవీందర్, కందే లింగం, ఆనందరెడ్డి, మురళి, అనిల్, రాజగోపాల్, రవి, శశికరణ్, దేవేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






