- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుతీనగర్ కాలనీ సమస్యల పరిష్కారంపై ఫోకస్.. రంగంలోకి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్
నగరంలోని అంబర్‌పేట్ పరిధి మారుతీనగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిష్కరిస్తున్నట్లు మారుతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్గౌడ్తెలిపారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: నగరంలోని అంబర్‌పేట్ పరిధి మారుతీనగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిష్కరిస్తున్నట్లు మారుతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్గౌడ్తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన కాలనీలో విస్తృతంగా పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ సమస్యలను ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నామన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఇప్పటికే స్ట్రీట్ నంబర్-3లో సీసీ రోడ్ల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో కాలనీలోని డ్రైనేజీలలో నిండిన పూడిక విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కాలనీలో విద్యుత్ సరఫరాలో జాప్యం లేకుండా కమిటీ కృషి చేస్తుందని, ఇష్టానుసారంగా రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయకుండా ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేశామన్నారు. కమిటీ సభ్యులు నిరంతరం కాలనీలో పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ జనరల్సెక్రటరీ నవకాంత్, ట్రెజరర్సత్యనారాయణ, వైస్ప్రెసిడెంట్సత్తన్న, జాయింట్సెక్రటరీ మోహన్, సెక్రటరీ వెంకటేశ్, అడ్వైజర్లు కిషన్, కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.






