- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన ట్రేడింగ్: ఢిల్లీకి రిషభ్ పంత్.. లక్నోకు కుల్దీప్ యాదవ్
ఐపీఎల్-2027లో ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లను వేర్వేరు జట్లలో చూడబోతున్నాము.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే సంచలన ప్లేయర్ ట్రేడింగ్ డీల్ అఫీషియల్‌గా పూర్తయింది. క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ మెగా డీల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫ్రెంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను ఎక్స్ఛేంజ్ చేసుకున్నాయి. ఈ ట్రేడ్‌తో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత హోమ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వగా, టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ గూటికి చేరాడు.
రూ.12 కోట్లతో పంత్ ‘ఘర్ వాపసీ’
2025 మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఏకంగా రూ.27 కోట్ల రికార్డు ధరతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న రిషభ్ పంత్, అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. లక్నో కెప్టెన్‌గా రెండు సీజన్లలోనూ విఫలం కావడంతో పాటు బ్యాటింగ్‌లోనూ తడబడ్డాడు. ఈ నేపథ్యంలో పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వెళ్లేందుకు మొగ్గు చూపాడు. అయితే ఈ ట్రేడ్ కోసం పంత్ ఏకంగా రూ.12 కోట్ల భారీ మొత్తాన్ని తగ్గించుకోవడానికి అంగీకరించడం గమనార్హం. ఇప్పుడు రూ. 15 కోట్ల సవరించిన ఫీజుతో పంత్ అధికారికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.
లక్నోకు స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్
మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున గత కొన్ని సీజన్లుగా అత్యంత విజయవంతమైన బౌలర్‌గా రాణిస్తున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీ ధరించనున్నాడు. ఢిల్లీ తరఫున 65 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన కుల్దీప్.. తన ప్రస్తుత ఫీజు అయిన రూ. 13.5 కోట్లకు లక్నో జట్టుకు ట్రేడ్ అయ్యాడు. లక్నో స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడంలో కుల్దీప్ కీలక పాత్ర పోషించనున్నాడు.






