ఏపీలో యాసిడ్ పురుగుల కలకలం.. భయపడిపోతున్న ప్రజలు

by Ajay Maddhiboyina |

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో యాసిడ్ పురుగులు (రోవ్ బీటిల్స్) కలకలం రేగింది. గత నెలరోజులుగా జిల్లాలో యాసిడ్ పురుగుల బెడద తీవ్రమైంది.

ఏపీలో యాసిడ్ పురుగుల కలకలం.. భయపడిపోతున్న ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో యాసిడ్ పురుగులు (రోవ్ బీటిల్స్) కలకలం రేగింది. గత నెలరోజులుగా జిల్లాలో యాసిడ్ పురుగుల బెడద తీవ్రమైంది. ఈ పురుగులు చర్మంపై వాలినప్పుడు నలిపేస్తే పెడెరిన్ అనే విషద్రవం బయటకు వస్తుంది. అది చర్మంపై పడితే తీవ్రమైన మంటచ దద్దుర్లు, నీటి పొక్కులు వస్తాయి. దీంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల పసిపిల్లలు, వృద్ధులు ఎక్కువ‌గా బాధ‌ప‌డుతున్నారు. ఈ పురుగుల‌ను వివారించాల‌ని గ్రామ‌స్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రోవ్ బీటిల్స్ అనేవి ప్ర‌పంచంలోనే అతిపెద్ద కీట‌క స‌మూహాల‌లో ఒక‌టిగా ఉన్నాయి. ఇవి ఎక్కువ‌గా వ్య‌వ‌సాయ భూములు, తోటలు లాంటి తేమ ప్ర‌దేశాల్లో ఉంటాయి. వీటిని చంప‌డానికి చేతుల‌తో న‌ల‌ప‌కూడ‌దు, చ‌ర్మంపైకి వ‌స్తే ప‌క్క‌కి నెట్టేయాలి. ఇంట్లోకి ఇవి ప్ర‌వేశించ‌కుండా దోమ‌తెర‌లు వాడటం, కిటికీల‌కు జాలి అమ‌ర్చ‌డం లాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. రాత్రి స‌మ‌యంలో లైట్ వెలుతురుకు ఇవి ఎక్కువ ఆక‌ర్షితం అవుతాయి కాబ‌ట్టి లైట్స్ ఆఫ్ చేసుకోవ‌డం మంచింది.

Next Story