బీజేపీ నాయకుని మృతికి చల్లా నివాళి

by Batti.Sumithra |

బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ తండ్రి, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ పుల్లయ్య మంగళవారం బేతవోలులో మరణించారు.

బీజేపీ నాయకుని మృతికి చల్లా నివాళి
X

దిశ, చిలుకూరు : బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ తండ్రి, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ పుల్లయ్య మంగళవారం బేతవోలులో మరణించారు. బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి మృతదేహం పై పూలమాలలు ఉంచి నివాళులర్పించి, బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామభక్తి మార్గంలో పయనించిన పుల్లయ్య కరసేవలో కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట బీజేపీ మండల అధ్యక్షుడు పారెల్లి మహేష్, ప్రధాన కార్యదర్శి రామినేని నరసింహవర్మ, ఉపాధ్యక్షుడు తిపిరిశెట్టి బసవయ్య, బుడిగె సురేష్, మోదుగు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు వెంకటేష్ బాబు, కవితారెడ్డి, బొలిశెట్టి కృష్ణయ్య, శకుంతల, కనగాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story