- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు వేదికల్లో విత్తన మేళా : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలలో నిర్వహిస్తున్న విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) పిలుపునిచ్చారు.

దిశ, మిర్యాలగూడ రూరల్ : రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలలో నిర్వహిస్తున్న విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే విత్తన మేళాలో రైతులకు అవసరమైన వరి, పప్పుధాన్యాలు, సోయాబీన్, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ తదితర వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాల వినియోగం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ క్రమంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
మిర్యాలగూడ క్లస్టర్ పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పంటలకు అవసరమైన విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు. విత్తన మేళా విజయవంతానికి వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు, అసిస్టెంట్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి, ఏవో రుశేంద్రమని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, పార్టీ మండల నాయకులు గుండు నరేందర్ గౌడ్, గళం వెంకన్న, దేశీడి శేఖర్ రెడ్డి ,స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






