ఇద్దరు కీలక మంత్రులపై పువ్వాడ అజయ్ సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |

ఖమ్మం జిల్లాలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ పార్కుకు సంబంధించిన అత్యంత విలువైన ప్రభుత్వ భూములను, నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి అత్యంత చౌకగా కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇద్దరు కీలక మంత్రులపై పువ్వాడ అజయ్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ పార్కుకు సంబంధించిన అత్యంత విలువైన ప్రభుత్వ భూములను, నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి అత్యంత చౌకగా కట్టబెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్ హయాంలో బుగ్గపాడు ఫుడ్‌పార్క్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ భూములు ఏపీ వ్యాపారులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదు కానీ.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ రెవెన్యూ మాత్రం మారింది. మరోపక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా వ్యవసాయం భూములు పెంచుకున్నారు. కాంగ్రెస్ మంత్రులు మొత్తం దండుపాళ్యం బ్యాచ్‌లా తయారు అయింది’ అని పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story