- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెక్‌డ్యాంలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం
పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల చెక్‌డ్యాంలో సుమారు 55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

దిశ, పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల చెక్‌డ్యాంలో సుమారు 55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం చెక్‌డ్యాంలో వృద్ధురాలి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాపన్నపేట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతురాలి ఆచూకీ కోసం పరిశీలించినప్పటికీ ఎలాంటి వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతురాలు బ్లూ కలర్ నైటీ ధరించి ఉండగా, చెవులకు రెడీమేడ్ కమ్మలు, ముక్కుకు పుడక ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి ఫోటో ఆధారంగా ఎవరైనా గుర్తించినట్లయితే పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ ఫోన్: 87126 57920, రూరల్ సీఐ కృష్ణమూర్తి ఫోన్: 87126 57883లను సంప్రదించాలని పోలీసులు కోరారు.






