VIRAL: ఒళ్లు జలదరించే ఘటన.. పండ్ల బండిలో ప్రత్యక్షమైన 9 అడుగుల పాము

by Kema Shiva Kumar |

జాతీయ రహదారి పక్కన ఉన్న పండ్ల బండిలో భారీ పాము కనిపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

VIRAL: ఒళ్లు జలదరించే ఘటన.. పండ్ల బండిలో ప్రత్యక్షమైన 9 అడుగుల పాము
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలో భారీ పాము కలకలం సృష్టించింది. జాతీయ రహదారి (National Highway) పక్కన నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఏకంగా 9 అడుగుల పొడవు ఉన్న పాము ప్రత్యక్షం కావడంతో స్థానికులు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. మెట్‌పల్లి పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన చిరు వ్యాపారులు పండ్ల బండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ పండ్ల బండిలో ఒక్కసారిగా భారీ పాము కనిపించింది. అది చూసిన వ్యాపారస్తులు, పండ్లు కొనడానికి వచ్చిన వినియోగదారులు భయంతో కేకలు వేస్తూ దూరంగా పరిగెత్తారు. రద్దీ ప్రాంతం కావడంతో అక్కడ క్షణాల్లో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.

అరగంట పాటు ఆపరేషన్ స్నేక్..

స్థానికులు వెంటనే స్నేక్‌ క్యాచర్లకు (Snake Catchers) సమాచారం అందించారు. ఈ మేరకు వారు స్పాట్‌కు చేరుకుని పండ్ల బండి మధ్యలో దూరిన ఆ భారీ పామును పట్టుకోవడానికి ప్రయత్నించారు. సుమారు అరగంట పాటు శ్రమించి, ఎట్టకేలకు ఆ 9 అడుగుల పామును సురక్షితంగా బయటకు తీసి బంధించారు. దీంతొ అటు వ్యాపారులు, ఇటు స్థానికులు పెద్ద ఊపిరి పీల్చుకున్నారు.

Next Story