- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండల మహిళా సాధికారత కోఆర్డినేటర్‌గా వంతడుపుల కస్తూరి
'మహిళా ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్' హుజురాబాద్ మండల కోఆర్డినేటర్‌గా చెల్పూర్ సర్పంచ్ వంతడుపుల కస్తూరిని నియమించారు.

దిశ, హుజురాబాద్ రూరల్: మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న 'మహిళా ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్' హుజురాబాద్ మండల కోఆర్డినేటర్‌గా చెల్పూర్ సర్పంచ్ వంతడుపుల కస్తూరిని నియమించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఒక రోజు అవగాహన సదస్సులో ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.
నియామకంపై స్పందించిన నూతన కోఆర్డినేటర్ వంతడుపుల కస్తూరి మాట్లాడుతూ.. "హుజురాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న ప్రతి అమ్మాయికి భరోసానిస్తాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా నా వంతు కృషి చేస్తాను. మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి ఆదుకుంటాను" అని స్పష్టం చేశారు. కస్తూరి నియామకం పట్ల స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.






