- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెస్సి రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో.. 6 ప్రపంచ కప్‌లలో గోల్స్‌తో నయా రికార్డ్
ఫిఫా వరల్డ్ కప్-2026లో క్రిస్టియానో రొనాల్డో ఎవరికీ సాధ్యం కాని అద్భుత రికార్డును నెలకొల్పాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్లు లియోనెల్ మెస్సి ((Lionel Messi), క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)ల మధ్య పోరు ఫిఫా వరల్డ్ కప్ 2026లోనూ తారాస్థాయికి చేరింది. అర్జెంటీనా స్టార్ మెస్సి ఆల్‌టైమ్ వరల్డ్ కప్ రికార్డు సృష్టించిన మరుసటి రోజే పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తనదైన శైలిలో బదులిస్తూ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
‘గ్రూప్ కె’లో భాగంగా ఉజ్బెకిస్తాన్ (Uzbekistan)తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 5-0తో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో రెండు అద్భుతమైన గోల్స్‌తో వీరవిహారం చేశాడు. ఈ ప్రదర్శనతో 6 వేర్వేరు ప్రపంచ కప్ ఎడిషన్లలో గోల్స్ సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో చరిత్ర సృష్టించాడు. మెస్సి కూడా 6 ప్రపంచ కప్‌లు ఆడినప్పటికీ 2010 ఎడిషన్‌లో ఆయన గోల్ చేయలేకపోవడంతో ఈ అరుదైన రికార్డు ఒక్క రొనాల్డోకు మాత్రమే సొంతమైంది.






