- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం అందరి బాధ్యత
విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని బాల త్రిపుర సుందరి అన్నారు.

దిశ, జడ్చర్ల : గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి అన్నారు. జడ్చర్ల మండల పరిధిలోని కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలా త్రిపుర సుందరి లక్ష రూపాయల తన సొంత ఖర్చులతో 250 మంది విద్యార్థులకు ప్లేట్లు , వాటర్ బాటిల్స్ ను బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాలా త్రిపుర సుందరి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం, వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల మండల అధ్యక్షులు యాట రామకృష్ణ ముదిరాజ్ , మండల ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జగదేశ్వర్, రమేష్ జి, సామల నరసింహులు, లింగం, యాదగిరి, కుమార్, మహేష్ ,శివ మహేందర్ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






