- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక అక్రమ రవాణాను నిలిపి వేయాలి
కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు కు బీఆర్ ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: జిల్లాలో అక్రమంగా అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణాను నిలిపివేయాలని మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలోని నాయకులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగపేట మండలం లోని ఆకనపల్లి మల్లారం, ఓడగూడెం, రమణ క్కపేట, గ్రామాలలో జరుగుతున్న ఇసుక రవాణాపై సిబిఐచే ఎంక్వయిరీ చేసి, వెంటనే నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేష్ రెడ్డి, వేముల బిక్షపతి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్కా రమేష్, వెంకటాపూర్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణా రెడ్డి, ములుగు మున్సిపల్ కౌన్సిలర్ కోకిల లక్ష్మి, నునావత్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.






