- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంపాపేట్ చౌరస్తాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్..
నిత్యం వేలాది వాహనాల రాకపోకలు.. చంపాపేట్ మెయిన్ రోడ్డుపై ప్రమాదకర గుంత దర్శనమిచ్చింది.

దిశ, చంపాపేట్: మనగరంలోని అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన చంపాపేట్ చౌరస్తాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ స్థానిక ప్రజలు, వాహనదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన రహదారిపై ఉన్న ఈ మ్యాన్‌హోల్ మూత పూర్తిగా దెబ్బతిని లోపల భారీ గుంత బయటపడటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. చంపాపేట్ చౌరస్తా మీదుగా ప్రతిరోజూ వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో మ్యాన్‌హోల్ కనిపించకుండా పోయి ప్రమాదాలు జరిగే అవకాశం మరింత పెరిగింది. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్‌హోల్ చుట్టూ ఉన్న కాంక్రీట్ భాగాలు కూడా దెబ్బతినడంతో రహదారి బలహీనంగా మారింది. చిన్న పొరపాటు జరిగినా వాహనదారులు గుంతలో పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి మ్యాన్‌హోల్‌కు శాశ్వత మరమ్మతులు చేపట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయంపై సామాజిక కార్యకర్త పాశం శ్రీశైలం మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యను అధికారులు అత్యవసరంగా పరిగణించి వెంటనే కొత్త మూత ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






