మనిషిని మాయం చేయడం దారుణం : సాయికృష్ణ మేనమామ

by Naga Rani Yarlagadda |

మనిషిని మాయం చేయడం దారుణం : సాయికృష్ణ మేనమామ
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పుచేసినవారెవరినైనా పోలీసులు శిక్షించవచ్చు కానీ.. మనిషి మాయం చేయడం మాత్రం దారుణమని సాయికృష్ణ మేనమామ వాపోయారు. కొద్దిసేపటి క్రితమే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన మేనల్లుడిని పోలీసులు మాయం చేశారని వాపోయారు. సాయికృష్ణ వ్యవహారంలో కృష్ణలంక పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని, ఆచూకీ దొరక్కుండా చేశారని ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని, సిట్ విచారణలో నిజాలన్నీ బయటికి వస్తాయన్నారు. సాయికృష్ణను మాయం చేసిన సీఐ నాగరాజును చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. కాగా.. మంగళవారం మధ్యాహ్నం సీఐ నాగరాజును సిట్ అరెస్ట్ చేయగా.. వియ్ స్టాండ్ విత్ యు నాగరాజు సర్ అంటూ.. పెద్ద ఎత్తున ప్లకార్డులు చేతపట్టి.. వెహికల్ ముందు, వెనుక ర్యాలీగా వెళ్లారు. నాగరాజు సర్ ప్రజలకోసం పనిచేసే మనిషి అని, ఆయన తప్పు చేయరంటూ అభిమానులు మద్దతిస్తున్నారు.

Next Story