- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన త్రిష.. ప్రేమ బంధానికి బ్రేక్ పడినట్లేనా!
ఈ హఠాత్ పరిణామంతో విజయ్, త్రిషల మధ్య ఏదో పెద్ద గొడవే జరిగిందనే అనుమానాలు నెటిజన్లలో, అభిమానుల్లో మొదలయ్యాయి.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష గత కొద్దికాలంగా గాఢమైన ప్రేమలో ఉన్నారంటూ చిత్ర పరిశ్రమలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడటం, కోర్టులో దరఖాస్తు చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం చకచకా జరిగిపోయాయి. ఆయన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో వీరిద్దరి పెళ్లి త్వరలోనే ఉంటుందని అందరూ గట్టిగా భావించారు. ఈనేపథ్యంలో.. తాజాగా త్రిష ఎవరూ ఊహించని విధంగా ఒక సంచలన ట్విస్ట్ ఇచ్చారు.
విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆయనకు ఎలాంటి శుభాకాంక్షలు తెలపలేదు. ప్రతి ఏడాది విజయ్ పుట్టినరోజున త్రిష సోషల్ మీడియాలో చాలా ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ ఈసారి కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. అంతటితో ఆగకుండా, ఆమె సోషల్ మీడియా ఖాతాలో విజయ్‌ను అన్‌ఫాలో కూడా చేసేశారు. ఈ హఠాత్ పరిణామంతో విజయ్, త్రిషల మధ్య ఏదో పెద్ద గొడవే జరిగిందనే అనుమానాలు నెటిజన్లలో, అభిమానుల్లో మొదలయ్యాయి. త్రిష అన్‌ఫాలో చేసిన విషయాన్ని స్క్రీన్ షాట్లతో సహా నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఎంతో కాలంగా కొనసాగుతున్న వీరి బంధానికి ఇప్పుడు బ్రేక్ పడినట్లేనా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటే, త్రిష తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. మొత్తానికి త్రిష అందరికీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.






