- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమ బెంగాల్ ‘హల్దియా’ నౌకాశ్రయానికి అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ హోదా
పశ్చిమ బెంగాల్ 'హల్దియా' ఓడరేవుకు ఇమ్మిగ్రేషన్ హోదా కల్పించిన కేంద్ర హోం శాఖ.. దేశంలో 41వ చెక్‌పోస్ట్‌గా రికార్డు!

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశ తూర్పు తీరంలో సముద్ర వ్యాపారాన్ని, పర్యాటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ 'హల్దియా' (Haldia) ఓడరేవును అధికారికంగా ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ ప్రయాణికులు, పర్యాటకులు మరియు విదేశీ నౌకల రాకపోకలకు హల్దియా రేవులో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం భారతదేశ పొడవైన తీర ప్రాంతం వెంబడి మొత్తం 40 గుర్తింపు పొందిన సముద్ర ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులు ఉండగా.. కేంద్ర హోం శాఖ తాజా చేరికతో హల్దియా దేశంలోనే 41వ ఇమ్మిగ్రేషన్ పోస్ట్‌గా అవతరించింది.
1968లో కోల్‌కతా పోర్ట్‌పై ఒత్తిడిని తగ్గించడానికి నిర్మించిన హల్దియా డాక్ కాంప్లెక్స్ (HDC), 1977 నుండి అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అయితే, పూర్తి స్థాయి ఇమ్మిగ్రేషన్ హోదా దక్కడం వల్ల ఇకపై ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ వాణిజ్యం తో పాటు క్రూయిజ్ పర్యాటకం కూడా భారీగా పుంజుకోనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఈ నిర్ణయానికి కొన్ని రోజుల ముందే గుజరాత్‌లోని దహేజ్, సిక్కా, తునా టెక్రా ఓడరేవులను కూడా కేంద్రం ఇమ్మిగ్రేషన్ పోస్టులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.






