- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టులో విచిత్రం.. డ్రైవర్‌కు ఉద్యోగి బాధ్యతలా?
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం చోటుచేసుకున్న ఒక ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.

దిశ, కొండగట్టు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం చోటుచేసుకున్న ఒక ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలయ ఈవోకు కారు డ్రైవర్‌గా విధులు నిర్వహించే వ్యక్తి ఆలయ ఉద్యోగి తరహాలో బాధ్యతలు నిర్వర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో విధులు, బాధ్యతలు స్పష్టంగా విభజించి ఉన్నప్పటికీ డ్రైవర్ ఉద్యోగి అవతారం ఎత్తి భక్తులతో వ్యవహరించడం, కొన్ని పరిపాలనా పనుల్లో జోక్యం చేసుకోవడం పట్ల భక్తులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖలో నియమిత సిబ్బంది ఉండగా ఇతరులు వారి పనులను నిర్వహించడం వెనుక కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆలయ పరిపాలనలో విధి నిర్వహణకు సంబంధించిన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణలో లోపం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఆలయ పరిపాలనలో పారదర్శకతను నెలకొల్పాలని భక్తులు కోరుతున్నారు.






