ఫార్మాసిటీ పొలాల్లో వైర్ల దొంగతనం..

by Kodari Anjali |

వ్యవసాయ పొలాలలోని విద్యుత్ వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్తున్న దొంగలను రైతులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.

ఫార్మాసిటీ పొలాల్లో వైర్ల దొంగతనం..
X

దిశ, యాచారం: గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళలో ఫార్మాసిటీ పొలాలలో వ్యవసాయ పొలాలలోని విద్యుత్ వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్తున్న దొంగలను రైతులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఫార్మాసిటీ రైతులు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ, తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త, గ్రామ శివారులోని ఫార్మసిటీ పొలాలలో కొందరు వ్యక్తులు అక్రమంగా వ్యవసాయ పొలాలలోకి ప్రవేశించి భారీ మొత్తంలో విద్యుత్ వైర్లను కత్తిరించి ఆటోలో వాటిని తరలిస్తుండగా ఫార్మాసిటీ రైతులు గడ్డం యాదయ్య, శ్రీశైలం, అనుమానంతో వాహనాన్ని అడ్డగించి ఎందుకు రైతుల విద్యుత్ వైర్లను తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా లైన్మెన్ చెప్పడంతోనే ఈ పని చేశామని రైతులకు చెప్పారు. వారిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఆటోను విద్యుత్ వైర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి దొంగలపై కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story