మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసిన సర్వే నెంబర్ 218 బాధితులు

by Kodari Anjali |

అమరావతి హైవే పేరుతో మరికొన్ని ప్లాట్లు అధికారులు స్వాధీన పరుచుకుంటున్న సందర్భంగా బాధితులు మంగళవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిశారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసిన సర్వే నెంబర్ 218 బాధితులు
X

దిశ, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ పేరుతో కొన్ని ప్లాట్లు , అమరావతి హైవే పేరుతో మరికొన్ని ప్లాట్లు అధికారులు స్వాధీన పరుచుకుంటున్న సందర్భంగా బాధితులు మంగళవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిశారు. ఏ అవసరం లేకపోయినా , ఎవరికి అడ్డం రాకపోయినా మిగిలిన 350 ప్లాట్లను అన్యాయంగా ప్రభుత్వం లాక్కుంటుందని బాధితులు ఆయనకు వివరించారు. ప్లాట్‌లో నిర్మించుకున్న షెడ్లు బేస్మెంట్ లను అధికారులు గుట్టు చప్పుడు కాకుండా కూలగొట్టారని బాధితులు మాజీ మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని మంత్రి తుమ్మలను జిల్లా కలెక్టర్‌ను కలిసి వేడుకున్నట్లు అజయ్ కుమార్ దృష్టికి తీసుకొని వచ్చారు. బాధితులకు అండగా ఉంటామని, బాధితుల పక్షాన పోరాడుతామని పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరిష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్భంగా సర్వే నెంబర్ 218 బాధితులను హరీష్ రావుకు దృష్టికి తీసుకెళ్లేందుకు పువ్వాడ అజయ్ కుమార్ సిద్ధమయ్యారు.

Next Story