- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి..
గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన కాటారం మండలంలో జరిగింది.

X
దిశ, కాటారం: గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం కాటారం మండలంలో కలకలం రేపింది. స్థానికులు, కథనం ప్రకారం.. కాటారం మండలంలోని ఓడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ కాటారం మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అటువైపు వచ్చి మాట కలిపారు. ఒక్కసారిగా కత్తులతో దాడికి దిగారు. గణేష్ కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన దుండగులు అక్కడి నుంచి పరుగెత్తి పారిపోయారు. ఈ దాడిలో గణేష్ ఛాతిపై తీవ్ర గాయమైంది. స్థానికులు,108 వాహనంలో భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు.
Next Story






