- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి
చిత్తూరు జిల్లా గంగవరం వద్ద ఘోర ప్రమాదం; కారు లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా విషాదం.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం (serious road accident) చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా గంగవరం మండలం YSR జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు కంటైనర్ ను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత భారీగా మారింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదానికి గురైన కారు బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారు బెంగళూరు రాజాజీ నగర్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతులు మోహన్ దాస్(71 ), నాగరాజరావు(61), కుసుమ(61), జయంతి(59), పూజ(33)గా గుర్తించారు.






