‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎఫెక్ట్.. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ మెగా డాటర్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-24 05:40:01  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎఫెక్ట్.. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ మెగా డాటర్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల మార్కును దాటేసిన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి మెగాస్టార్ మాస్ ఎలిమెంట్స్ తోడవ్వడం, దానికి తోడు విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో మెరవడంతో ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సినిమా ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న నిర్మాత సుస్మితా కొణిదెల(Susmitha Konidela), తాజాగా తన నిర్మాణ సంస్థ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ‘న్యూ చాప్టర్ బిగిన్స్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆఫీస్ ఫోటోలను షేర్ చేసిన ఆమె, భవిష్యత్తులో ఈ బ్యానర్ నుండి మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయని ప్రకటించారు. షైన్ స్క్రీన్‌తో కలిసి సుస్మితా నిర్మించిన ఈ చిత్రం మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపడమే కాకుండా, ట్రేడ్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి సరసన నయనతార నటించిన ఈ సినిమా 2026 ప్రారంభంలోనే టాలీవుడ్‌కు ఒక సాలిడ్ హిట్‌ను అందించింది.

Read More..

‘విశ్వంభర’ నుంచి బిగ్ ట్రీట్.. అలాంటి అప్డేట్‌తో అంచనాలు పెంచే ప్లాన్‌లో మేకర్స్!

Next Story