- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు
పెట్రోల్‌లో 22% నుండి 30% వరకు ఎథనాల్ మిశ్రమం కలిపిన ఇంధన రకాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం నుండి పూర్తి మినహాయింపు ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో హరిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఎథనాల్ కలిపిన పెట్రోల్‌పై (Ethanol Blended Petrol) ప్రస్తుతం ఇస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ (Central Excise Duty) మినహాయింపులను మరిన్ని శాతాలకు విస్తరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 22 శాతం, 25 శాతం, 27 శాతం 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమంతో కూడిన పెట్రోల్ వేరియంట్లకు కూడా ఈ ఎక్సైజ్ సుంకం మినహాయింపులు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇథనాల్ పెట్రోల్ మిశ్రమాలకు (Fuel Blends) ఎక్సైజ్ సుంకం పూర్తిగా సున్నా (Nil Excise Duty Rate) కానుంది. ఈ రాయితీల ద్వారా మార్కెట్లో ఇథనాల్ (Ethanol) ఆధారిత ఇంధనాల లభ్యత పెరగడమే కాకుండా, భవిష్యత్తులో వాహనదారులపై ఇంధన ధరల భారం తగ్గే అవకాశం ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ మినహాయింపులను పొడిగించినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత ధరల మార్పుపై ఎటువంటి క్లారిటీ రాలేదు కానీ భవిష్యత్తులో ధరల్లో తగ్గుదల ఉండే అవకాశం కనిపిస్తుంది.






