ఏపీలో దారుణం.. కోచింగ్‌కు వెళ్లి మరొకరితో లివింగ్‌లో ఉందని వివాహితను చంపిన కుటుంబం

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గ్రూప్స్ కోచింగ్ కు వెళ్లి మ‌రొక‌రితో లివింగ్ రిలేష‌న్ షిప్ పెట్టుకుంద‌నే కార‌ణంతో వివాహిత‌కు ఆమె కుటుంబం హ‌త్య చేసింది. అనంత‌రం దానిని స‌హ‌జ‌మ‌ర‌ణంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసింది.

ఏపీలో దారుణం.. కోచింగ్‌కు వెళ్లి మరొకరితో లివింగ్‌లో ఉందని వివాహితను చంపిన కుటుంబం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గ్రూప్స్ కోచింగ్ కు వెళ్లి మ‌రొక‌రితో లివింగ్ రిలేష‌న్ షిప్ పెట్టుకుంద‌నే కార‌ణంతో వివాహిత‌కు ఆమె కుటుంబం హ‌త్య చేసింది. అనంత‌రం దానిని స‌హ‌జ‌మ‌ర‌ణంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసింది. ఈ ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. టెక్క‌లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జూన్ 1న రాత్రి దుంప‌ల హ‌రిణి 24 అనే వివాహిత‌ మృతి చెందింది. హ‌రిణి గుండెపోటుతో మ‌ర‌ణించింద‌ని ఆమె కుటుంబ స‌భ్యులు మ‌రుస‌టి రోజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అయితే త‌ర‌వాత హ‌రిణి మాట్లాడిన సెల్ఫీ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమెను కుటుంబ స‌భ్యులే దారుణంగా హ‌త్య చేసిన‌ట్టు తేలింది.

హ‌రిణికి త‌న మేన‌మామ‌తో 2020లోనే వివాహం కాగా నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా హ‌రిణి కొన్ని నెల‌ల క్రితం గ్రూప్స్ కోచింగ్ కోసం కుమారుడితో క‌లిసి హైద‌రాబాద్ కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో కోచింగ్ సెంట‌ర్ లో హైద‌రాబాద్ కు చెందిన సుధా నాగేంద్ర అనే యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్తా వివాహేత‌ర సంబంధానికి దారి తీయ‌డంతో విష‌యం హ‌రిణి త‌ల్లికి తెలిసింది. దీంతో కుటుంబ స‌భ్యులు ప‌ద్ద‌తిమార్చుకోవాల‌ని హ‌రిణిని హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో హ‌రిణి భ‌ర్త నుండి విడాకులు కోరుతూ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. తాను నాగేంద్ర‌ను వివాహం చేసుకుంటాన‌ని భ‌ర్త‌, త‌ల్లితో గొడ‌వ ప‌డింది. ఈ నెల 31న పెద్ద‌ల స‌మ‌క్షంలో విడాకులు ఇప్పిస్తామ‌ని టెక్క‌లికి పిలిచిన త‌ల్లి కూతురును హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

దీంతో జూన్ 1న హ‌రిణి త‌ల్లి, తాత‌, భ‌ర్త క‌లిసి ఇనుప రాడ్డుతో కొట్టి హ‌త‌మార్చారు. అనంత‌రం ర‌క్తం మ‌ర‌క‌లు క‌నిపించ‌కుండా చేసి గుండెపోటుతో మ‌ర‌ణించింది అంటూ మ‌రుస‌టి రోజు ద‌హ‌న‌సంస్కారాలు చేశారు. అయితే అప్ప‌టికే హ‌రిణి ప్రియుడికి తాను జూన్ 5 త‌ర‌వాత హైద‌రాబాద్ తిరిగి రాక‌పోతే ఏదో సివియ‌ర్ గానే జ‌రిగింద‌ని భావించాల‌ని త‌న‌కు త‌న కుటుంబ స‌భ్యుల‌పై అనుమానంగా ఉంద‌ని చెప్పింది. హ‌రిణి మ‌ర‌ణానంత‌రం నాగేంద్ర పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. కేసులో నిందితురాలిగా ఉన్న హ‌రిణి త‌ల్లిని, ఆమె భ‌ర్త దంతేశ్వరరావును, ఆమె తాత‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story