- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మురికి కాలువ గుంతలోనే పారిశుద్ధ్య ట్రాక్టర్ ట్రాలీ
by Batti.Sumithra |
డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య ట్రాక్టర్ ట్రాలీ నెల రోజులకు పైగానే మురికి కాలువ గుంతలో ఇరుక్కుని ఉండటంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, డోంగ్లి, (మద్నూర్) : డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య ట్రాక్టర్ ట్రాలీ నెల రోజులకు పైగానే మురికి కాలువ గుంతలో ఇరుక్కుని ఉండటంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ తీసుకునే క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ మురికి కాలువ గుంతలో చిక్కుకుందని, అప్పటి నుంచి సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాలకు గుంతలో నీరు చేరి ట్రాక్టర్ ట్రాలీ మరింతగా ఇరుక్కుపోయింది. పంచాయతీ ట్రాక్టర్ పనిచేయకపోవడంతో గ్రామంలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి ట్రాక్టర్‌ను బయటకు తీసి ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






