ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కాం కేసు (Liquor scam case)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) సహా ఆరుగురు నివాసాల్లోనే 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి నిధుల మళ్లింపు, ఇతర అంశాలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఆధారాలు లభించడంతో కసిరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈడీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story