- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు
అక్రమంగా చెరువులను చెరపట్టిన అక్రమార్కులకు ఆటంకం కలిగించారన్న అక్కసుతో రెవెన్యూ అధికారులని సైతం చూడకుండా విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

దిశ, నర్సంపేట : అక్రమంగా చెరువులను చెరపట్టిన అక్రమార్కులకు ఆటంకం కలిగించారన్న అక్కసుతో రెవెన్యూ అధికారులని సైతం చూడకుండా విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నర్సంపేట ఎమ్మార్వో ఆదేశాలతో మాదన్నపేట జీపీఓ నరసింహస్వామి, మరో ఉద్యోగితో కలిసి మాదన్నపేట చెరువు దగ్గర మట్టి తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్రమంగా మట్టి తరలించొద్దని, అనుమతి లేదని వారించాడు.
ఈ క్రమంలో మొరం దందా నిర్వాహకులు తమ అనుచరులతో కలిసి ఇద్దరి పై బుధవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. చివరికి గాయాలతో అక్కడ నుండి ఇద్దరు బయటపడ్డారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. అక్రమంగా మొరం తీస్తుంటే వద్దని చెప్పిన ఉద్యోగి పై దాడికి పాల్పడటం పట్ల డివిజన్ వ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






