సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రీ-రిలీజ్‌కు అదిరే రెస్పాన్స్.. తొలి రోజే 30 వేల టికెట్లు

by Pulgam srinivas |

‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ రీ-రిలీజ్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన లభిస్తోంది. తొలి రోజు ప్రదర్శనల కోసం ఇప్పటికే సుమారు 30 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రీ-రిలీజ్‌కు అదిరే రెస్పాన్స్.. తొలి రోజే 30 వేల టికెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: సూర్య హీరోగా సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’. ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. 2008లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయగా, ఇక్కడ మంచి ఆదరణ లభించింది. ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు రీ-రిలీజ్ సినిమాలపై విశేష ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే రీ-రిలీజ్ అయిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని జూన్ 12న తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, రీ-రిలీజ్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ప్రదర్శనల కోసం ఇప్పటికే సుమారు 30 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ సినిమా మరోసారి భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story