- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ టు లడాఖ్ బైక్ యాత్ర.. యువతికి బండారు దత్తాత్రేయ అభినందనలు!
హైదరాబాద్‌కు చెందిన యువతి, అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ విద్యనభ్యసిస్తున్న మెట్టు భాంధవి హైదరాబాద్ నుంచి లడాఖ్‌కు చేపట్టిన సాహసోపేత మోటార్ సైకిల్ యాత్రకు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ,రాంనగర్: హైదరాబాద్‌కు చెందిన యువతి, అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ విద్యనభ్యసిస్తున్న మెట్టు భాంధవి హైదరాబాద్ నుంచి లడాఖ్‌కు చేపట్టిన సాహసోపేత మోటార్ సైకిల్ యాత్రకు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ముషీరాబాద్‌లోని కలాధర్ నగర్ కాలనీ అధ్యక్షులుమెట్టు వాసు, మెట్టుపద్మావతి దంపతుల కుమార్తె భాంధవి, తన కలల యాత్రగా భావిస్తున్న ఈ ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లడాఖ్ వరకు నిర్వహించనున్నారు. బైక్ అండ్ టూరింగ్ కంపెనీ” మ్యాడ్ ఓవర్ లడాఖ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో 10 మంది రైడర్లు పాల్గొంటుండగా, హైదరాబాద్ బృందం నుంచి సుప్రియా, కార్తీక్, కైవల్య, మౌనిక, నవ్య, పల్లవి తదితరులు భాగస్వాములు కానున్నారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నేటి యువత కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని, మెట్టు భాంధవి చేపట్టిన ఈ సాహస యాత్ర యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, ముఖ్యంగా యువతులు ఏ రంగంలోనైనా ధైర్యంగా ముందుకు సాగగలరనే సందేశాన్ని సమాజానికి అందిస్తోందని అన్నారు. బాంధవి విజయానికి ఆమె తల్లిదండ్రులు మెట్టు వాసు, పద్మావతి అందించిన ప్రోత్సాహం, మద్దతు అభినందనీయమని, కుటుంబ సహకారమే యువత విజయాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని దత్తాత్రేయ అన్నారు. లడాఖ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలవాలని బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు.






