- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:జిల్లా కలెక్టర్
ఈనెల 28న నిర్వహించబోయే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంతో పాటు జూలై 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

దిశ, ఆసిఫాబాద్: ఈనెల 28న నిర్వహించబోయే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంతో పాటు జూలై 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వీటి నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు అందించాలన్నారు. 46 వేల 516 మంది పిల్లలు ఉన్నారని. వారి కోసం జిల్లావ్యాప్తంగా 670 పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలతో పాటు బస్. రైల్వే స్టేషన్లలో 18 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే జూన్ 29 మరియు 30 తేదీలలో వైద్య ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అదేవిధంగా.. జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ సందర్భంగా అల్బెండజోల్ మాత్రలను 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో 1,67,702 మంది ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఈ నివారణ మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులందరూ పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.






